Header Banner

ప్రధాని మోదీని కలిసిన లోకేశ్ ఫ్యామిలీ.. రెండు గంటలపాటు సుదీర్ఘ సమావేశం!

  Sun May 18, 2025 13:57        Politics

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర మంత్రి, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం దిల్లీలో సమావేశమయ్యారు. సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్తో కలిసి రాత్రి 7.20 గంటలకు ప్రధాని అధికార నివాసం 7-లోకకల్యాణ్ మార్కు వెళ్లిన లోకేశ్ రాత్రి 9.30 వరకు ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తొలిసారి ఈ ఏడాది జనవరి 8న అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ నెల 2న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికీ హాజరయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ తనకు స్వాగతం పలికిన లోకేశ్ను.. దిల్లీకి వచ్చినప్పుడు తనను ఎందుకు కలవలేదని ఆరా తీశారు. ఈసారి వచ్చినప్పుడు కలవాలని ప్రత్యేకంగా చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని శనివారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

 

ఇది కూడా చదవండి: గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఈ సందర్భంగా మోదీ.. లోకేశ్, ఆయన కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. 'ప్రధానితో ఈ సమావేశం లోకేశ్ కుటుంబానికి ఎంతో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర చరిత్రాత్మకంగా సాగిన విధానాన్ని వివరిస్తూ ప్రచురించిన యువగళం కాఫీ టేబుల్ బుక్ను.. ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోదీ ఒక పుస్తకంపై సంతకం చేసి లోకేశు బహూకరించారు. ఇది అరుదైన, మధురమైన జ్ఞాపకం. ఈ సమావేశం సందర్భంగా బ్రాహ్మణి, దేవాండ్లను ప్రధాని ఆశీర్వదించారు. రాష్ట్ర పురోగతికి నిరంతరం చేయూతనందిస్తున్నందుకు మోదీకి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ భద్రత, దేశపురోగతి కోసం ప్రధాని అందిస్తున్న బలమైన, నిర్ణయాత్మక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వికసిత్ భారత్-2047 లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ తనవంతు చేయూతనందించడానికి అవసరమైన మార్గదర్శనం చేయాలని ప్రధానిని కోరారు' అని లోకేశ్ కార్యాలయం సమావేశానంతరం ఓ ప్రకటనలో తెలిపింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting